ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 7:55 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

త్వరలో…ఆమరణ నిరాహార దీక్ష సంజయ్ కుమార్టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వినర్ ఆమరణ నిరాహార దీక్ష

త్వరలో…ఆమరణ నిరాహార దీక్ష సంజయ్ కుమార్
టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వినర్ ఆమరణ నిరాహార దీక్ష

అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి.

మందమర్రి… లో వంద పడకల ఆసుపత్రి…సాధించు కుందాము.
40 వెల పైన జనాభా ఉన్న మందమర్రి లో… పేరకు పెద్ద పెద్ద లీడర్లు.. మాజీ మంత్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ పేద ల కోసం మాత్రం నాలుగు పడకల ఆసుపత్రి..
పాము కాటు తో ఇప్పటికి ఎన్నో ప్రాణాలు పోయాయి.. కనీసము అంటివేనాము ఇంజక్షన్ ఉండదు… మహిళల కోసం గైయాకలోజిస్ట్ డాక్టర్ ఉండదు, ఓ బొక్కల డాక్టర్రు ఓ కంటి డాక్టర్రు ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం రాత్రి పూట అత్యవసర సర్వీసెస్ కోసం డాక్టర్స్ ఉండరు
సరైన మందులు ఉండవు
పేదవాడికి సరైన వైద్యం అందాకా పిట్టల్ల ప్రాణాలు పోతున్నవి ఇంకా అదిగాక
మాంచెరియల్ వెళ్లే సరికి మార్గ మధ్యలో లోనే ప్రాణాలు పోతున్నవి
ఇంకో పక్క స్థానికంగా ఉద్యోగాలు లేక నిరుపేద బతుకులు.. ప్రైవేట్ ఆసుపత్రి కి పోలేక ఎంతో మంది రోగుల బతుకులు గాల్లో కల్సి పోతూ తున్నవి ఇగ మన స్థానిక స్వార్ధ రాజకీయ నాయకులు
కేవలం ఓట్ల కోసం ఎలక్షన్ ల అప్పుడు ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారు..
అందుకే పేద ప్రజల కోసం.. సంజయ్ అన్నా తో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేసి మందమర్రి బిడ్డలకోసం.. వంద పడుకల ఆసుపత్రి సాదించుకుందాము రండీ కదిలి రండీ పార్టీలకు అతీతంగా కలసి మందమర్రి ప్రజలకు అండగా ఉందాము..
ఈ కార్యక్రమం లో..పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ కారంరాజు పట్టణ ప్రధాన కార్యదర్శి, మహిళ అధ్యక్షులు సంధ్య జుపాక, వోడ్నాల సత్యనారాయణ, మహిళమండల అధ్యక్షులు సుగుణ, సమాకవిత, జయ,పొలంపల్లి శ్రీనివాస్ కొడివారి కవిత తదితరులు పాల్గొన్నారు
ఇట్లు